రాయచోటి పట్టణంలో ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పాల్గొంటున్న గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో ప్రతి ఇంటా మహిళల నుంచి ఆత్మీయ స్వాగతాలు లభిస్తున్నాయి. జగన్ ప్రభుత్వం అందచేస్తున్న పథకాలును వారే ఎమ్మెల్యే కు తెలుపుతూ , ఈ పథకాలుతో తాము ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్నామని సంతోషం వ్యక్తం చేశారు. మహిళలకు ప్రతిఅంశంలోనూ పెద్దపీట వేస్తున్నారని, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత సీఎం జగన్ కు దక్కుతుందని అన్నారు. కల్పించడం, పొదుపు సంఘాల అక్కా చెల్లెమ్మలుకు
మహిళల సంక్షేమానికి వైఎస్ఆర్ పెన్షన్ కానుక, వైఎస్ఆర్ బీమా, చేదోడు, ఆమ్మఒడి ప్రతి పథకం ఎవ్వరి సిపారసు లేకుండానే నేరుగా తమ బ్యాంకు ఖాతాలలోకి నగదును జమ అవుచుండం గొప్ప విషయమని అక్కచెల్లెమ్మలు తెలిపారు. మహిళలకు రక్షణ కవచంగా దిశ చట్టాన్ని చేశారని, మహిళల భద్రత, సంక్షేమం కోసం సీఎం జగన్ కృషిచేయడం అభినందనీయం అన్నారు.