ఆమదాలవలస మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో ఖాళీ అయిన వాలంటీర్ల స్థానంలో కొత్తవారిని నియమించి వారికి బుధవారం స్పీకర్ క్యాంప్ కార్యాలయం వద్ద నియామక పత్రాలు అందజేసిన ఆంధ్రప్రదేశ్ శాసన సభ పతి తమ్మినేని సీతారాం. వివిధ కారణాల రీత్యా వాలంటీర్ ఉద్యోగాలకు రాజీనామా చేసిన వారి స్థానంలో కొత్తవారిని నియమించి నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాలంటీర్ గా మీకు ఇచ్చిన 50 ఇళ్లకు మంచి సేవలు అందించాలని స్పీకర్ కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రవి సుధాకర్, మామిడి రమేష్ కుమార్, శిల్లా. మల్లికార్జున స్వామి, సాదు చిరంజీవి, వైఎస్సార్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.