కేంద్ర మాజీ మంత్రి దివంగత నేత కింజరాపు ఎర్రన్నాయుడు పదవ వర్ధంతి సందర్భంగా టెక్కలిలో బుధవారం తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఘన నివాళులు అర్పించారు. టెక్కలి లోని ఎర్రన్నాయుడు పార్కులో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు, ఎర్రన్నాయుడు విగ్రహాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు. అలాగే పాత జాతీయ రహదారిలో ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న ఎర్రన్న విగ్రహానికి ఘన నివాళులర్పించారు. ఎర్రన్నాయుడు ఆశయాలు కొనసాగిస్తాం, జోహార్ ఎర్రన్నాయుడు అంటూ నినాదాలు చేశారు.