రాజాం నియోజకవర్గం సంతకటి మండలం నాగావళి నదిలో వచ్చే కొద్దిపాటి సాగునీటిని కుడి ఎనమ ప్రధాన కాలువల ద్వారా రైతులకు అందించేందుకు నారాయణపురం ఆనకట్ట వద్ద సాగునీటి నిలుపుదల చేసేందుకు ఇరిగేషన్ అధికారులు భగీరథ ప్రయత్నం చేశారు. బుధవారం ఇరిగేషన్ డి ఈ ఈ కె మురళీకృష్ణ ఆధ్వర్యంలో జేఈ ఏఈలు షట్టర్ల వ్యవస్థపునర్దించారు గత రెండు నెలల్లో ఆనకట్టుపై ఉన్న కొన్ని షట్టర్లు వరద ఉధృతికి కొట్టుకొని వెళ్లిపోయాయి. వాటిని యంత్రాల సహాయంతో బయటికి తీసి ఆనకట్ట షట్టర్ల వ్యవస్థకు పునరుద్ధరించారు. ఈ మధ్యకాలంలో 118 షట్టర్లో 20 కి పైగా షట్టర్లు నదిలోకి కొట్టుకొని వెళ్లిపోయాయి. వీటిని ట్రాక్టర్లు యంత్రాలతో తీసుకుని వచ్చి వాటి స్థానంలో వాటిని అమర్చి నదిలో వస్తున్న కొద్దిపాటి సాగునీరును కుడి ఎడమ ప్రధాన కాలువలకు మళ్ళించారు. పొట్ట దశలో ఉన్న వరి పంటలకు సాగునీరు ఎంతో అవసరం. అధికారులు చేపట్టిన సాగునీటి మళ్లింపు పై రైతుల హర్షం వ్యక్తం చేస్తున్నారు.