ఎచ్చెర్ల నుండి కొయ్యాంకు వెళ్లే రోడ్డు మార్గం ఇరుకుగా ఉండటంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అసలే మలుపులు ఆపై రోడ్డుకి ఇరువైపులా చెట్లు అధికంగా మొలవడంతో రెండు వాహనాలు ఎదురెదురుగా వచ్చేటప్పుడు తప్పించుకోవడం ఇబ్బందిగా ఉందని వాహనదారులు తెలిపారు. బుధవారం రెండు వాహనాలు ఒకదానికోకటి దాటుతూ ఇబ్బంది పడ్డాయి. అధికారులు రోడ్డు వెడల్పును పెంచేందుకు చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.