వార్షిక తనిఖీ లో భాగంగా బుధవారం విశాఖపట్నం రేంజ్ డిఐజి ఎస్. హరికృష్ణ శ్రీకాకుళం సబ్ డివిజన్ కార్యాలయాన్ని సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ క్రమంలో ముందుగా పోలీసు గార్డు సిబ్బంది అయినకు గౌరవ వందనాన్ని సమర్పించారు. పలు ముఖ్యమైన రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించి, రికార్డు నిర్వహణ పట్ల సంతృప్తిని వ్యక్తపరిచారు. సబ్ డివిజన్ పరిధిలో సిబ్బంది వివరాలు, నేరాలు నమోదు తదితర అంశాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అపరిష్కృతం కానీ ముఖ్యమైన గ్రేవ్ కేసులు త్వరితగతిన దర్యాప్తు చేసి కేసు కేసులు పరిష్కరించాలని ఆదేశించారు. ముఖ్యంగా ఎస్. సి, ఎస్టీ కేసులు సమగ్రమైన దర్యాప్తుతో పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించాలని పేర్కొన్నారు. మహిళల భద్రతకు ప్రథమ ప్రాధాన్యత కల్పిస్తూ విధులు నిర్వర్తించాలని సూచించారు.
సబ్ డివిజన్ లో ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణకు ముందస్తు చర్యలు చేపట్టి రాత్రి పగలు గస్తీలు నిర్వహించి నేర నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సూచించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది ప్రతి రోజు విధిగా గ్రామాల్లో సందర్శించి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని ఆయా సమస్యలు పరిష్కరించి వారికి న్యాయం చేకూర్చాలని సూచించారు. అదేవిధంగా ప్రతిరోజు ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో విజిబిల్ పొలిసింగ్ లో భాగంగా వాహనాల తనిఖీలు చేపట్టి రోడ్డు ప్రమాదాలు నివారణకు వాహన చోదకులుకు రహదారి నియమాలుపై అవగాహన కల్పించాలని, నాటుసారా, గంజాయి, గుట్కా, మద్యం అక్రమ రవాణా అరికట్టాలని సూచించారు. డిఐజి తోపాటు జిల్లా ఎస్పి జి. ఆర్. రాధిక, డిఎస్పీ ఎం. మహేంద్ర ఉన్నారు.