రాజంపేట న్యూస్ రాజంపేట నియోజక వర్గంమద్యం దుకాణం ఎదుట బత్యాల ఆధ్వర్యంలో బుధవారం రాజంపేట పట్టణంలోని నియోజకవర్గ టిడిపి కార్యాలయం నందు కల్తీ మద్యం, భూ ఆక్రమణలపై పత్రికా సమావేశాన్ని నిర్వహించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ గౌరవ, , శ్రీ బత్యాల చంగల్ రాయుడు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు మద్యాన్ని నిషేధిస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కల్తీ మద్యాన్ని ప్రవేశపెట్టి ప్రజల పాణాలతో చెలగాటం ఆడుతున్నాడని అన్నారు. మద్యం దుకాణాల్లో మద్యాన్ని కొనుగోలు చేసిన వ్యక్తులకు ఎటువంటి బిల్లు లేకుండా మధ్యాన్ని అమ్ముతున్నారని. , బిల్లులు ఇవ్వకపోవడంతో పోలీసులు వారి పైన తప్పుడు కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు. అంతేకాక తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి పాత బ్రాండ్లను తీసేసి నాసిరకమైన బ్రాండ్ల తో ప్రజల ప్రాణాలనుతీస్తూ పేద మధ్యతరగతి కుటుంబాలను రోడ్ల మీదికి ఈడుస్తున్నారని అన్నారు.
రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం వచ్చినప్పటి నుండి వైకాపా నాయయకులు ఎక్కడ చూసినా భూములను ఆక్రమించుకొని దోచుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అనంతరం మద్యం దుకాణం దగ్గరకు వెళ్లి మద్యం బాటల్లను కొనుగోలు చేయగా వారు బిల్లు ఇవ్వకపోవడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి మద్యం షాపు వద్ద నిరసనలు తెలియజేశారు. రాష్ట్రవ్యాప్తంగా మద్యం షాపుల్లో ఎక్కడా కూడా బిల్లులు లేకుండా మధ్యాన్ని విక్రయిస్తున్నారు కానీ ఎంత మధ్యం వచ్చింది ఎంత మధ్యాన్ని విక్రయిస్తున్నారో ప్రభుత్వ ట్రెజరీ లెక్కల్లో కూడా తెలియని దుస్థితి ఏర్పడిందని అన్నారు. , అలాగే మద్యం ద్వారా ప్రభుత్వానికి వెళ్లాల్సిన డబ్బు జగన్మోహన్ రెడ్డి ఖజానాకు వెళ్తుందని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా మించిపోయింది లేదని వెంటనే మద్యం షాపులలో బిల్లు పద్ధతిని తీసుకురావాలని ప్రభుత్వాన్ని మీడియా ద్వారా కోరారు. , ప్రభుత్వం ఈ విషయంపై స్పందించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పలువురు టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.