మారుతీ సుజుకీ ఇండియా ఇప్పటి వరకు 2.5 కోట్ల వాహనాలను ఉత్పత్తి చేసింది. ఈ సంస్థ 1983 డిసెంబర్ లో వాహనాల ఉత్పత్తిని ప్రారంభించింది. 1994 మార్చి నాటికి 10 లక్షల వాహనాలను, 2011లో కోటి వాహనాలను ఉత్పత్తి చేసింది. 2018 జూలై నాటికి 2 కోట్ల వాహనాలను, నాలుగేళ్లలో మిగిలిన 50 లక్షల వాహనాలను ఉత్పత్తి చేసి అరుదైన మైలురాయిని చేరుకుంది. మారుతీ సుజుకీ హరియాణాలోని గురుగ్రామ్‌లో తన తొలి పరిశ్రమను ప్రారంభించింది.