అనంతపురం జిల్లా దర్గాహోన్నూరులో విద్యుత్ లైన్ తెగిపడి నలుగురు వ్యవసాయ కూలీలు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉండాలని సీఎం జగన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొక్కజొన్న కంకులను కోయడానికి వెళ్లిన కూలీలు ట్రాక్టర్‌పై విద్యుత్ వైరు తెగిపడడంతో మృతి చెందారు.