జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ రాష్ట్రంలో అతిపెద్ద కుంభకోణం రైతు భరోసా కేంద్రాలేనన్నారు. రాష్ట్రంలోని 10,700 రైతు భరోసా కేంద్రాల్లో అవినీతి జరిగిందని విజిలెన్స్ నివేదిక చెబుతోందన్నారు.వైసీపీ ప్రభుత్వం రైతుల నుంచి లంచాలు తీసుకుంటోందని ఆరోపించారు. ఈ-క్రాప్ కోసం కూడా లంచాలు తీసుకుంటున్నట్లు వెల్లడైంది అని తెలిపారు.