తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఎన్టీఆర్ జిల్లా నేతలతో భేటీ అయ్యారు. ఈ నెల 4న ఎన్టీఆర్ జిల్లాలో నిర్వహించనున్న ‘బడుడే బడుడు’ కార్యక్రమంపై నేతలతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చన్నారు. వచ్చే మే నెల, లేదా డిసెంబరులో ఎన్నికలు జరగొచ్చని చర్చ జరుగుతోందని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు పార్టీలోని ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. నాయకులంతా ప్రజల్లోనే ఉండాలని స్పష్టం చేశారు.