వైసీపీ ఎమ్మెల్సీ చల్లా భగీరథరెడ్డి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న భగీరథరెడ్డి ఈరోజు సాయంత్రం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. చల్లా భగీరథరెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. 46 ఏళ్ల వయసులో ఆయన మృతి చెందడంపై వైసిపి వర్గాల్లో విషాదం నెలకొంది.భగీరథరెడ్డి అంత్యక్రియలు రేపు (నవంబర్ 3) కర్నూలు జిల్లా అవుకులో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది.భగీరథ రెడ్డి మొదట్లో కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేశారు. 2019లో తండ్రితో కలిసి వైసీపీలో చేరారు.