పులివెందులకు విచ్చేసిన రాష్ట్ర మంత్రి విడుదల రజనీకి ఘనస్వాగతం లభించింది. ఈ సందర్భంగా పట్టణ పరిధిలోని నిర్మాణదశలో ఉన్న వైద్యకళాశాల నిర్మాణ పనుల విషయమై బుధవారం ఆమె పరిశీలించిన సంగతి విదితమే. ఈ క్రమంలో మంత్రిని కౌన్సిలర్లు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. మంత్రికి ఘనస్వాగతం పలికిన వారిలో వైసీపీ మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ వరప్రసాద్, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa