టీ20 వరల్డ్ కప్ లో టీమిండియా దాదాపుగా సెమీస్ కు చేరినట్లే. బుధవారం బంగ్లాదేశ్ పై విజయంతో భారత్ 6 పాయింట్లతో గ్రూపు-2లో టాప్ లో నిలిచింది. సౌతాఫ్రికా 5 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. బంగ్లాదేశ్ 4 పాయింట్లతో థర్డ్ ప్లేస్ లో ఉంది. జింబాబ్వేపై టీమిండియా గెలిస్తే నేరుగా సెమీస్ కు చేరుకుంటుంది. ఒకవేళ ఓడిపోతే ఇతర జట్ల మ్యాచ్ ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది.