వయస్సుతో నిమిత్తం లేకుండా చాలామందికి చేతులు వణుకుతాయి. శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గినప్పుడు అలా జరుగుతుంటుంది. మద్యం అతిగా తాగడం, మధుమేహం, సరిపడా నిద్ర లేకపోవడం, ధూమపానం వంటివి ఇందుకు కారణాలుగా చెప్పొచ్చు. విటమిన్ 12 లోపం వల్ల కూడా ఇలా జరుగుతుంటుంది. మన జీవన శైలి వల్లే వణుకు అనేది వస్తుంది. అలవాట్లు మార్చుకుంటే వణుకు తగ్గుతుంది. నాడీ వ్యవస్థ చురుగ్గా ఉంటుంది.