ముంబైకి చెందిన లాయర్ వద్ద రూ 44782 దోచుకున్న సైబర్ నేరగాళ్లు. మద్యం డెలివరీ కోసం ఆన్లైన్లో శోధించగా వాట్సాప్ నుంచి ఆర్డర్ చేయాలని మెసేజ్ వచ్చింది. రెండు బీర్లకు 499 చెల్లించాలని క్యూఆర్ కోడ్ పంపగా స్కాన్ చేయగానే 4999 కట్ అయ్యాయి. డబ్బు తిరిగి చెల్లించాలని కోరగా మరో కోడ్ పంపాడు. స్కాన్ చేయగానే ఈసారి భారీ మొత్తంలో కట్ అయ్యాయి. లాయర్ మరోసారి ఫోన్ చేయగా అతడి ఫోన్ను బ్లాక్ చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.