భారత్-బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్లో ఫేక్ ఫీల్డింగ్ వివాదం మరింత ముదురుతోంది. కోహ్లీ ఫేక్ ఫీల్డింగ్ వల్ల తమకు రావాల్సిన ఐదు పరుగులు కోల్పోయామని బంగ్లాదేశ్ క్రికెటర్ నూరుల్ అహ్మద్ పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలివేయబోమని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఆపరేషన్ చైర్మన్ జలాల్ యూనస్ తెలిపారు. అంపైరింగ్ అంశాలను సరైన వేదికపైకి తీసుకెళ్తామని జలాల్ స్పష్టం చేశారు.