ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన ఘటన ఏపీలోని కుప్పంలో గురువారం జరిగింది. పాతపేటకు చెందిన రోహిత్, భువనేశ్వరి 2 నెలల కిందట ప్రేమవివాహం చేసుకున్నారు. గురువారం భువనేశ్వరి(25) ఇంటి మిద్దెపై ఉన్న గదిలో ఉరివేసుకుని కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అత్తింటివారే తమ కూతుర్ని చంపారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa