ఓ కంపెనీలో పనిచేస్తూ దాని కళ్లుగప్పి ఇంకో సంస్థలోనూ పనిచేయడాన్నే మూన్‌లైటింగ్ అంటారు. తాజాగా ఈ ‘మూన్ లైటింగ్’ వ్యవహారంపై ఆదాయపన్ను శాఖ కూడా దృష్టి సారించింది. రెండో ఉద్యోగంలో సంపాదించే దానికి కూడా పన్ను చెల్లించాల్సిందేనంటూ హెచ్చరికలు జారీ చేసింది. చెల్లింపు రూ. 30 వేలు దాటితే టీడీఎస్ కట్ చేయాల్సిందేనని, రెండో ఆదాయంపై ఐటీ రిటర్న్స్‌లో వెల్లడించాలని లేదంటే జరిమానా తప్పదని అధికారులు హెచ్చరించారు.