ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి వైద్యరంగంలో ఎంతో మేలు చేస్తున్నా.. చంద్రబాబునాయుడు, టీడీపీ నాయకులు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని విమర్శించారు. ఆమె కడప రిమ్స్‌లో ప్రాంతీయ జిల్లాల వైద్యాధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి వైద్య రంగంలో నూతన ఒరవడి తీసుకొచ్చారన్నారు. తండ్రి బాటలోనే ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి వైద్యరంగంలో సమూలంగా మార్పులను తీసుకొచ్చి ఎన్నడూ లేనివిధంగా వైద్యరంగంలో విశేష అభివృద్ధి చేపడుతున్నారని చెప్పారు. కొత్త జిల్లాల్లో ఐదు మెడికల్ కళాశాలల నిర్మాణాలను ప్రారంభించి, వేగంగా పనులను చేయిస్తున్న ఘనత జగనన్న ప్రభుత్వానిదేనన్నారు. వైద్యరంగంలో గతంలో ఎన్నడూ చేపట్టని విధంగా వైద్యుల దగ్గరి నుంచి వివిధ స్థాయి ఉద్యోగుల వరకు కాంటాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను మొత్తం 44,760 మందిని నియమించారని చెప్పారు.