సమస్యల పరిష్కారం కోరుతూ బ్యాంక్ ఉద్యోగుల యూనియన్ (ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్) ఆధ్వర్యంలో కావలి, స్టేట్‌బ్యాంక్ ఎదురుగా ధర్నా చేశారు. ఈ సందర్భంగా యూనియన్ల నేతలు మాట్లాడుతూ ఐబీఏ యూనియన్లతో చేసుకున్న ఒప్పందం ప్రకారం వేతనాలు, బదిలీలు సీఎస్‌బీ, డీబీఎస్ బ్యాంక్‌ల్లో కూడా అమలు చేయాలని, ఒప్పంద ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని, ఉద్యోగుల బదిలీలు పారదర్శంగా చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐబీఈఎ నేతలు సభ్యులు విజయ్, ఉదయశ్రీ, మనోజ్, కుమార్, సురేంద్ర, అజయ్ తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa