ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గతంలో ప్రతిపక్ష నేత హోదాలో చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్రకు ఐదేళ్లు నిండిన సందర్భంగా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆధ్వర్యంలో మంత్రాలయంలో ఆదివారం సంబరాలు జరుపుకున్నారు. వైసీపీ యువజన విభాగం రాష్ట్ర నాయకులు ప్రదీప్ రెడ్డి ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నేతలు, కార్యకర్తలు, అభిమానులు స్వీట్లు పంచుకొని సంబరాలు జరుపుకున్నారు. అనంతరం రాఘవేంద్ర సర్కిల్ వరకు ర్యాలీ వెళ్లి అక్కడ ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.