ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శిశుపాలుడిలా జగన్ రెడ్డి వంద తప్పులు దాటాయి: చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Nov 06, 2022, 03:36 PM

శిశుపాలుడిలా జగన్ రెడ్డి వంద తప్పులు దాటాయి.. ఇక మిగిలింది ప్రభుత్వ పతనమే తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. వైసీపీ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించి దిక్కుమాలిన పనులు చేస్తోందని విమర్శించారు. మంగళగిరి నియోజకవర్గంలోని ఇప్పటం గ్రామం వెళుతున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను పోలీసులు అడ్డుకోవడంపై చంద్రబాబు ఫైరయ్యారు. ఈ మేరకు శనివారం చంద్రబాబు వరుస ట్వీట్లు చేశారు. కూల్చడం మాని ఏదైనా కట్టి చూడండి.. ఆ తృప్తి ఏంటో అర్థం అవుతుందని వ్యాఖ్యానించారు. జగన్ పని అయిపోయిందన్నారు.


‘‘ఈ వైసీపీ ప్రభుత్వానికి పోయే కాలం దాపురించి దిక్కుమాలిన పనులు చేస్తుంది. శిశుపాలుడిలా జగన్ రెడ్డి వంద తప్పులు దాటాయి...ఇక మిగిలింది ప్రభుత్వ పతనమే. ఆంధ్రప్రదేశ్ అంటే హింస, దాడులు, కూల్చివేతలు, అడ్డగింతలు, అక్రమ అరెస్టులు అన్నట్లుగా మార్చేశారు. ముఖ్యమంత్రి అహంకారానికి, అధికార మదానికి జవాబు చెప్పడానికి ప్రజలు సిద్దంగా ఉన్నారు. 600 ఇళ్లున్న ఇప్పటం గ్రామంలో 120 అడుగులకు రోడ్డు విస్తరిస్తారా? మీ దుర్బుద్ధి, రాజకీయ కక్ష ప్రజలకు అర్థం కాదు అనుకుంటున్నారా? మీవి రోడ్లు వేసే మొహాలేనా?


ఇప్పటం గ్రామం వెళుతున్న జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్‌ను అడ్డుకుంటేనో.. చీకట్లో మా పర్యటనపై రాళ్లు వేస్తేనో మీరు పైచేయి సాధించలేరు. కూల్చడం మాని ఏదైనా కట్టి చూడండి...ఆ తృప్తి ఏంటో అర్థం అవుతుంది. జగన్ పని అయిపోయింది.’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com