రాజస్థాన్ లో పుష్కర్ మేళా ఘనంగా నిర్వహిస్తున్నారు. అజ్మీర్ నుండి 11 కి.మీ దూరంలో ఉన్న పుష్కర్ హిందువుల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ప్రతి ఏడు కార్తీక పూర్ణిమ నాడు ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు విదేశీ పర్యాటకులు కూడా భారీగా హాజరవుతారు. ఇక్కడ పుష్కర స్నానం చేస్తే తమను తాము శుద్ధి చేసుకోవచ్చని భక్తులు నమ్ముతారు.