ట్విట్టర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖుల పేరుతో కొందరు అకౌంట్లు క్రియేట్ చేసి ఫన్నీ మీమ్స్, వీడియోలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ట్విట్టర్ హ్యాండిల్లో ఆ ఖాతాలకు ఖచ్చితంగా పేరటీ అని పేర్కొనాలని ఎలాన్ మస్క్ స్పష్టం చేశాడు. లేని పక్షంలో ఆ ట్విట్టర్ ఖాతాలపై శాశ్వతంగా నిషేధం విధించనున్నట్లు ఆదివారం ప్రకటించారు. ఎలాంటి వార్నింగ్ లేకుండానే అలాంటి ఖాతాలను సస్పెండ్ చేస్తామని తెలిపారు.