గ్రామాలతో పాటు దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి అన్నారు. ఆదివారం పెద్దతిప్ప సముద్రం మండలంలోని తుమ్మరకుంట గ్రామంలోని గుట్టపై వెలసిన శ్రీమల్లేశ్వర స్వామి ఆలయ పునఃనిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.