భీమవరం నియోజవర్గం సింహాద్రి అప్పన్నలయం వద్ద గత 28 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వాముల జరుపుకుంటున్న పడిపూజని అడ్డుకున్న అధికారులు తక్షణమే క్షమాపణ చెప్పాలి అంటూ రాజోలు నియోజకవర్గం సఖినేటిపల్లి మండలం టేకిశెట్టిపాలెం గ్రామం శ్రీ జ్యోతి స్వరూప పీఠం స్వాములందరూ ముక్తకంఠంతో ఖండించడం జరిగింది. అధికారం మదం నెత్తికెక్కి కొట్టుకుంటున్నా అధికారులందరూ అయ్యప్ప స్వామి ఆగ్రహానికి గురికాక తప్పదని స్వాములు అందరూ హెచ్చరించారు.