వజ్రకరూరు మండల కేంద్రంలోని సచివాలయం-2 పరిధిలో సోమవారం ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి 'గడప గడపకు మన ప్రభుత్వం' కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామస్తులు మాజీ ఎమ్మెల్యేకు ఘనంగా స్వాగతం పలికారు. ప్రతి గడపకు వెళ్లి సీఎం జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న పథకాలను ఆయన వివరించారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చినట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా ప్రతీ పథకం అర్హులైన లబ్ధిదారులకు అందజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.