మండలంలో కార్మిక ఉద్యమ నేత కామ్రేడ్ ఎస్. రమేష్ 5వ వర్ధంతి సందర్భంగా సోమవారం మండలం సిఐటియు కార్యాలయంలో నివాళి అర్పించారు. ఆయన చిత్రపటానికి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కర్రీ. అప్పారావు పూలమాల వేసి నివాళి అర్పించి ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఆర్. రాము మాట్లాడుతూ విశాఖ జిల్లాలో కార్మికుల సమస్యలపై అనేక పోరాటాలు చేసిన యోధుడు ఎస్. రమేష్ ఆయన లేని లోటు కార్మిక వర్గానికి తీవ్ర నష్టం అచ్చుతాపురం సెజ్ ప్రాంతంలో బ్రాండిక్స్ ఇతర పరిశ్రమల్లో అనేక పోరాటాలు నిర్వహించి కార్మికులకు కనీస వేతనాలు, బోనస్, ఈఎస్ఐ, పిఎఫ్, వంటి హక్కులు కల్పనకు కృషి చేశారు, పూడిమడక , గంగవరం ఇతర ప్రాంతాల మత్స్యకారులకు అనేక పోరాటాలు నిర్వహించి లబ్ధి చేకూర్చారు , ఏజెన్సీలో కాఫీ కార్మికుల సమస్యల పైన జిల్లాలో ఆశ, అంగన్వాడి, మధ్యాహ్నం భోజనం , ఐకెపి, వీఆర్ఏ , వంటి స్కీం వర్కర్ల సమస్యలపై కార్మికులను ఐక్యం చేశారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలపై అలుపెరగని పోరు సల్పి కార్మికుల రక్షణకై అనేక పోరాటాలు నిర్వహించారు. వీరి ఆశయ సాధన కోసం కార్మికులందరూ ఐక్యంగా ఉద్యమించి ఆయన బాటలో పయనించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కార్యదర్శి కె. సోమునాయుడు , ఆటో యూనియన్ నాయకులు రాజు పంచాయతీ కార్మికులు అప్పలరాజు ప్రజలు కనకరాజు నాయుడు తదితరులు పాల్గొన్నారు.