తాడిపత్రి ఎస్డీపిఓ పరిధిలో ఉన్న గుత్తి, పామిడి పోలీసు స్టేషన్లను పరిపాలనా సౌలభ్యం, శాంతిభద్రతల దృశ్యా గుంతకల్లు సబ్ డివిజన్ పరిధిలోకి మార్చేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే వై. వెంకట్రామిరెడ్డికి పోలీసు అధికారులు కృతజ్ఞతలు తెలియ జేశారు. సోమవారం రాత్రి ఎమ్మెల్యే వైవిఆర్ క్యాంపు కార్యాలయంలో గుంతకల్లు డిఎస్పి యు. నరసింగప్ప, పామిడి, గుత్తి సిఐలు కిరణ్ కుమార్ రెడ్డి, వెంకటరామిరెడ్డి మర్యాద పూర్వకంగా కలసి పుష్పగుచ్చాలు అందజేసి సత్కరించారు. ఎమ్మెల్యే కృషితోనే ప్రభుత్వం ఆమేరకు ఉత్తర్వులు జారీచేసిందని డిఎస్పీ అన్నారు. అనంతరం కేకు కోసి ఎమ్మెల్యే పోలీసు అధికారులకు తినిపించారు. ఈ కార్యక్రమంలో పామిడి, గుత్తి ఎస్సైలు చంద్ బాషా, శ్రీనివాసులు పాల్గొన్నారు.