మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లా ఖురాయ్ ప్రాంతంలో ఆసక్తికర ఘటన జరిగింది. ఓ యువకుడిని ముగ్గురు మహిళలు ఆదివారం చెప్పుతో కొట్టుకుంటూ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వ్యక్తితో ఖురాయ్కు చెందిన యువతి ఎఫైర్ పెట్టుకుంది. ఇద్దరూ అక్టోబర్ 12 ఇంట్లో నుంచి భోపాల్ వెళ్లిపోయి కొన్ని రోజులు సహజీవనం చేశారు. అతడి వ్యవహార శైలి నచ్చక ఆమె ఇంటికి వచ్చేసింది. తనను వేధించాడని తల్లికి చెప్పింది. ఆదివారం ఆ వ్యక్తి స్వగ్రామానికి వచ్చాడు. విషయం తెలుసుకున్న ప్రియురాలు తన తల్లి, సోదరితో కలిసి వెళ్లి అతడిని పట్టుకుంది. చెప్పులతో కొడుతూ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో అప్పగించింది. తనను వేధించాడని కేసు పెట్టింది.