కడప జిల్లా సిద్ధపటం మండలంలోని కనుములోపల్లి లో వెలసిన శ్రీ ఉమాదేవి సహిత నీలకంఠేశ్వర స్వామి అష్టోత్తర (108) ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వాహకులు సోమా బాబు ఆధ్వర్యంలో మహాశివుడికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, 108 శివలింగములకు పంచామృతాభిషేకం వంటివి నిర్వహించారు.
పంచామృతం, పంచంద్రవ్య అభిషేకాలు, అలంకరణలు చేసి శ్రీ నీలకంటేశ్వర స్వామికి, శ్రీ ఉమాదేవి అమ్మవారికి వేదంపండితులు కన్నుల పండుగలా కళ్యాణమహోత్సవాన్ని నిర్వహించారు. కళ్యాణ మహోత్సవాన్ని కడప నగరం, సిద్దవటం మండలం నుంచి భక్తులు తరలివచ్చి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించారు. రాత్రి 108 మీటర్ల పట్టు వస్రంతో వత్తి రూపంలో తయారుచేసి స్వామి వారికి అభిముఖంగా 50 కేజీల నెయ్యితో వెలిగించిన అఖండ జ్యోతి కార్యక్రమానికి రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి సోదరుడు మేడా మధుసూధన్ రెడ్డి హాజరై స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈకార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఏకుల రాజేశ్వరి రెడ్డి, వైయస్సార్సిపి యువ నాయకులు తుర్రా ప్రతాప్ నాయుడు, నాగం నరసింహారెడ్డి, మాజీ సర్పంచ్ కె. వి సుబ్బయ్య, మండల ఉపాధ్యక్షుడు నారపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, ఏకుల వెంకటరామిరెడ్డి, నాగం మురళీధర్ రెడ్డి, పల్లె సుబ్బారెడ్డి, కాడే రమణ, పి. చిన్నపరెడ్డి, మచ్చా సుబ్బరాయుడు, రావుల సుబ్బారెడ్డి, ఎం. రవి నాగిపోగు, పుల్లయ్య, పాలగిరి సుధాకర్ రెడ్డి, (సింగల్ విండో అధ్యక్షుడు) తదితరులు పాల్గొన్నారు.