నందిగామలో ఎవరు అవినీతికి పాల్పడుతున్నారో అందరికీ తెలుసని సీనియర్ టీడీపీ నాయకుడు కోగంటి బాబు అన్నారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యపై వైసీపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. భవన నిర్మాణదారులు వద్ద నుంచి ఫ్లోర్‌కు ఎంత వసూలు చేస్తున్నారో అందరికీ తెలుసన్నారు. రైతుబజార్, మునిసిపల్ కార్యాలయాల వద్ద నుంచి మీరు చేస్తున్న దోపిడీ అందరికీ తెలుసన్నారు. అవి భరించలేక మీ పార్టీ కౌన్సిలర్లు విలపిస్తున్నారన్నారు. చైర్పర్సన్ సహా మెజారిటీ కౌన్సిలర్లు మీపై తిరుగుబాటు చేయలేదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ అరుణ్ ధనదాహానికి పల్లగిరి, రాఘవాపురం కొండలు రూపు రేఖలు మారిపోయాయన్నారు. పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాల్లో రూ. కోట్లు ఆర్జించారని విమర్శించారు. సుబాబుల్ వ్యాపారుల నుంచి అక్రమార్జన చేస్తున్నారన్నారు. తగిన సమయంలో ప్రజలు బుద్ధి చెపుతారన్నారు. టీడీపీ నాయకులు పాల్గొన్నారు.