ఎచ్చెర్ల నియోజకవర్గ అభివృద్ధి కోసమే రాజకీయా ల్లోకి వచ్చానని.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని పొందూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. సోమవారం రణస్థలంలో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలిశెట్టి మాట్లాడుతూ.. తనకు ఎచ్చెర్ల నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వస్తోందని, ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. ఈ నియోజకవర్గంలో పుట్టానని, ప్రజా సేవ చేయడమే ధ్యేయమని తెలిపారు. తొలుత దివంగత నేతలు ఎన్టీఆర్, కింజరాపు ఎర్రన్నాయుడు విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షుడు చౌదరి నారాయణమూర్తి, సీనియర్ నాయకులు కె.త్రిమూర్తులురాజు, కోళ్ల అప్పలనాయు డు, దామోదరరావు, బాలబొమ్మ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.