చంద్రగ్రహనాన్ని పురస్కరించుకొని మంగళగిరి నగరంలో మంగళవారం ఉదయం 8 గంటల నుంచి దేవాలయాలను మూసివేశారు. నగరంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంతో పాటు శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి వారి దేవస్థానం, శ్రీ అఖిలాండేశ్వరి అమ్మవారి దేవస్థానం, నవులూరు పుట్టతోట శ్రీ నాగేంద్రస్వామివారి ఆలయం తదితర చిన్న పెద్ద దేవాలయాలు మూసివేశారు. నిత్యం రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తులతో కళకళలాడుతూ ఉండే శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం సెంటర్ చంద్రగ్రహణం కారణంగా వెలవెల పోయింది. గ్రహణం అనంతరం రాత్రికి దేవాలయాలు సంప్రోక్షణ చేసి తిరిగి బుధవారం ఉదయం నుంచి స్వామివారికి యధావిధిగా జరిగే పూజలు, భక్తులకు సర్వదర్శనాలు ఉంటాయని దేవస్థానం అధికారులు చెప్పారు.