ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఈ నెల 11న గుంటూరులో పర్యటించనున్నారు. భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా జరిగే కార్యక్రమాలకు సీఎం జగన్ హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం గుంటూరులో సీఎం జగన్ పర్యటన ఏర్పాట్లను ప్రజాప్రతినిధులు, అధికారులు పరిశీలించారు. పోలీసు పరేడ్ గ్రౌండ్‌లోని హెలిప్యాడ్‌ను, సీఎం ప్రయాణించే మార్గాలను ప్రజాప్రతినిధులు పరిశీలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa