వ్యంగ్యంగా మాట్లాడిన ఎమ్మెల్యేకు ఘాటుగా బదులిచ్చిందో మహిళ. గడప గడపకు మన ప్రభుత్వంలో భాగంగా ఎమ్మెల్యే వంశీ ఇంటింటికీ తిరిగారు. భవనీ అనే మహిళ యువత ఇతర రాష్ట్రాలకు వలస పోతున్నారు, సీఎంను అడిగి ఐటీ కంపెనీలు తీసుకురండి అని ఎమ్మెల్యేతో అన్నారు. దీనికి ఎమ్మెల్యే వ్యంగ్యంగా ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను బాగా చూస్తున్నట్లుంది అన్నారు. దానికి ఆమె మీరు పెద్దవారు అయింది ఆ పత్రికల వల్లేగా అంటూ ఘాటుగా సమాధానం చెప్పారు.