కొంత కాలంగా ఎక్కడా రూ.2 వేల నోట్లు కనిపించడం లేదు. దేశవ్యాప్తంగా ఏటీఎంలలో రూ.500ల నోట్లే వస్తున్నాయి. దీంతో రూ.2వేల నోటు రద్దు చేస్తారని వదంతులు వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2016లో నోట్ల రద్దు తర్వాత రూ.2 వేల నోటు తీసుకొచ్చింది. 2022 మార్చి నాటికి మొత్తం కరెన్సీలో రూ.2 వేల నోట్ల శాతం 1.6 శాతానికి తగ్గిపోయింది. 2016-17లో రూ. 354.29 కోట్ల రూ.2000 నోట్లను ఆర్‌బీఐ ముద్రించింది. 2017-18లో రూ. 1.15 కోట్ల నోట్లకు, 2018-19 నాటికి రూ.4.66 కోట్లకు రూ.2000ల నోట్ల ముద్రణ తగ్గిపోయింది. 2019-20 ఆర్థిక సంవత్సరం నుంచి రూ.2 వేల నోట్ల ముద్రణ ఆగిపోయినట్లు ఆర్‌బీఐ గణాంకాల ద్వారా అర్ధం అవుతోంది. నల్లధనాన్ని అరికట్టేందుకు ముద్రణ ఆపేశారని, మార్కెట్ నుంచి క్రమంగా రూ.2 వేల నోట్లను ఆర్‌బీఐ వెనక్కి తీసుకోనుందని తెలుస్తోంది.