విశాఖ నుండి విజయవాడ వైపు వెళ్తున్న గూడ్సు రైలు మంగళవారం ఉదయం పట్టాలు తప్పింది. దీంతో పట్టాలు తప్పిన బోగీ మినహా మిగతా బోగీలను ట్రాక్ నుండి రైల్వే అధికారులు తప్పించారు. ఈ ప్రమాదంతో పలు రైళ్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. అత్తిలి రైల్వే స్టేషన్ లో కాకినాడ లింగంపల్లి స్పెషల్ ట్రైన్ ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.రైళ్లు పునరుద్ధరించేందుకు ఐదు గంటల సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa