సుప్రీంకోర్టు 50వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. 2024 నవంబర్ 10 వరకు ఆయన సీజేఐ పదవిలో కొనసాగనున్నారు. తండ్రికి తగ్గ వారసుడిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ పేరు తెచ్చుకుంటున్నారు. ఆయన తండ్రి జస్టిస్ యశ్వంత్ విష్ణు చంద్రచూడ్ 44 ఏళ్ల క్రితం 7 ఏళ్ల 5 నెలల పాటు సీజేఐగా బాధ్యతలు నిర్వర్తించారు.