ప్రభుత్వ ఆరోగ్య సంస్థల నాణ్యత కొలమానంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 'జాతీయ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్' ధృవీకరణ పత్రా లను జిల్లాలోని 17 ఆస్పత్రులకు అనంతపురం జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి ప్రదానం చేశారు. వీటిలో గుంతకల్లు ఏరియా ఆసుపత్రి మరియు 16 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలున్నాయి. స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద ఆసుపత్రుల పరిశుభ్ర నిర్వహణకు ఇచ్చే కాయకల్ప్ అవార్డులను 10 ఆసుపత్రులకు అందించారు.