కళ్యాణదుర్గం పట్టణంలోని అనంతపురం, ముదిగల్లు రింగ్ రోడ్డు నందు బుధవారం తెల్లవారుజామున బెంగళూరు నుండి చత్తీస్గడ్ వెళ్ళవలసిన టస్కర్ వాహనం ముదిగల్లు బైపాస్ నుంచి వేగంగా వస్తూ బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో అటుగా వస్తున్న అనంతపురానికి వెళ్తున్న టమోటా మినీలారీ టస్కర్ వాహనాన్ని ఢీకొట్టడంతో బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగలేదు. పోలీసులు విచారణ చేపట్టి ట్రాఫిక్ అంతరాయం జరగకుండా చర్యలు చేపట్టారు.