నవమాసాలు కడుపులో మోసి జన్మనిచ్చిన కన్నప్రేమను కఠినత్వం చేసుకుని మద్యం మత్తుకు బానిసైన కొడుకు వేధింపులు భరించలేక ఓ తల్లి తన కొడుకును కడతేర్చిన సంఘటన మంగళవారం రాత్రి గుంతకల్లు పట్టణంలో చోటుచేసు కుంది. రెండవ పట్టణ పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పాత గుంతకల్లుకు చెందిన బేల్దారి నాగరాజు కుమా రుడు కురుబ భీమేష్ (25)అను యువకుడు మద్యానికి బానిసై ప్రతిరోజు తాగి ఇంటికి వచ్చి డబ్బులు కోసం మరియు పెళ్లి చేయమని తల్లిదండ్రులను వేధించే వాడు. దీంతో తండ్రి కొడుకు వేధిం పులకు ఇల్లు విడిచి చెన్నై వెళ్ళిపో యాడు. ఐతే అతడు రోజూ అతిగా మద్యం సేవించి తల్లి జయమ్మను వేధిస్తూ ఉండేవాడు. మంగళవారం రాత్రి కూడా అతిగా మద్యం సేవించి వేధించడంతో నిగ్రహం కోల్పోయిన ఆ తల్లి కన్నప్రేమను కఠినత్వం చేసుకుని చిన్న కొడుకు సంగమేస్ సహాయంతో ఇద్దరూ కలిసి రాత్రి 11 గంటల సమయంలో కత్తితో భీమేష్ ను పొడిచి చంపి వేశారు. అనంతరం శవాన్ని కాలువలో వేయడానికి మోటార్ సైకిల్ లో వెళుతుండగా కుక్కలు అరవడంతో అక్కడే ఉన్న వ్యక్తి చూడగా శవాన్ని అక్కడే పడ వేసి పారిపోయారన్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.