జగనన్న హరిత నగరాలలో భాగంగా గుంతకల్లు పట్టణంలో రహదారు లకు ఇరువైపులా ఏర్పాటు చేస్తున్న మొక్కలను సంరక్షణ చేయడంలో ప్రజలు కూడా సకరించాలని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న కోరారు. బుధవారం పట్టణ పరిధి లోని ఆలూరు రోడ్డు ఇరువైపులా మున్సిపల్ సిబ్బంది నాటుతున్న మొక్కలను కమీషనర్ బండి శేషన్న పరిశీలించారు. మొక్కలు నాటిన తర్వాత వాటికి రక్షణ కంచె వేయా లని అదేవిధంగా ప్రతి రోజూ నీరు పోయాలని సిబ్బందిని ఆదేశించారు. మొక్కలు నాటిన ప్రాంతాలలో ఆ పరిసరాల ప్రజలు కూడా వాటి సంరక్షణకు సహకరిం చాలని కోరారు. ఆయనతో పాటు టౌన్ ప్లానింగ్ టిపిబిఓ మురళి, సచివాలయ కార్యదర్శిలు, ప్లానింగ్ అమినిటీ కార్యదర్శిలు పాల్గొన్నారు.