టీ20 ప్రపంచకప్ ఫైనల్ పోరు గురించి దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. "ఫైనల్స్ కు భారత్-న్యూజిలాండ్ వెళ్తాయి. భారత్ ప్రపంచ కప్ గెలుచుకుంటుందని ఆశిస్తున్నా. సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ మంచి ఫాంలో ఉన్నారు. టీమిండియాలోని అందరికీ గొప్ప నైపుణ్యాలు ఉన్నాయి." అని అతడు అన్నాడు. ప్రస్తుతం ఇండియా పర్యటనలో ఉన్న డివిలియర్స్ మంగళవారం మీడియాతో మాట్లాడారు.