మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో దారుణం జరిగింది. 20 రోజుల క్రితం అడంపూర్ గ్రామానికి చెందిన మహిళ (26) పాపకు జన్మనిచ్చింది. అయితే చిన్నారికి అనారోగ్యంగా ఉండడంతో అకోలాలోని జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లింది. అనారోగ్యం తగ్గకపోవడంతో చిన్నారిని తల్లి గొంతు నులిమి చంపేసింది. పోస్టుమార్టంలో హత్య విషయం తేలడంతో నిందితురాలిని మంగళవారం పోలీసులు అరెస్ట్ చేశారు.