జాతీయ రహదారికి వ్యవసాయ భూములిచ్చిన రైతులను ఆదుకునేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు కృష్ణారెడ్డి కోరారు. ఎర్రగుంట్ల మండలం తిప్పలూరు గ్రామానికి చెందిన పలువురు రైతులతో ఆయన ఎంపీ అవినాష్ రెడ్డి, కలెక్టర్ విజయరామరాజును కలెక్టరేట్ కలిశారు. రైతులు పడుతున్న ఇబ్బందులను వారికి వివరించారు. బెంగళూరు- విజయవాడ హరిత రహదారి నిర్మాణానికి తిప్పలూరు గ్రామానికి చెందిన రైతుల భూములు 140 ఎకరాల వరకు ప్రభుత్వం సేకరిస్తోందన్నారు. ఎకరాకు రూ. 18 లక్షలు మాత్రమే చెల్లిస్తామని అధికారులు అంటున్నారని, మార్కెట్ ధర ఎకరం రూ. 2 కోట్లుందన్నారు. బాధిత రైతులు నష్టపోకుండా న్యాయం చేయాలని కలెక్టర్ ను కోరారు.