పిచ్చాటూరు మండలం రామగిరి లో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో బుధవారం కరపత్రాలు పంచుతూ ప్రభుత్వ పథకాలు ద్వారా పొందిన లబ్ధిని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ప్రజలకు వివరిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు మండల పార్టీ వైఎస్ఆర్సిపి అధ్యక్షులు హరిచంద్ర రెడ్డి, పార్టీ నాయకులు పాల్గొన్నారు.