తిరువూరు నియోజకవర్గ పరిధిలో గల ఏ కొండూరు మండలం రామచంద్రపురం గ్రామంలో బుధవారం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేకు స్థానికులు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలను క్యాలెండర్ ద్వారా వివరిస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.