ఈ నెల 11న విశాఖలో ప్రధాని పర్యటన సందర్భంగా రాష్ట్ర వ్యాప్త నిరసనలకు సీపీఎం పార్టీ పిలుపునిచ్చింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వని ప్రధానికి రాష్ట్రంలో పర్యటించే నైతిక హక్కు లేదని సీపీఎం విమర్శించింది. ఈ నిరసనలకు ప్రతిఒక్కరూ మద్దతివ్వాలని, ప్రత్యేక హోదా కోసం జగన్ బహిరంగంగా డిమాండ్ చేయాలని సీపీఎం సూచించింది. కాగా, కాంగ్రెస్ కూడా 10, 11 తేదీల్లో నిరసనలకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.